VIDEO: కన్నుల పండుగగా శ్రీరామ పట్టాభిషేకం

VIDEO: కన్నుల పండుగగా శ్రీరామ పట్టాభిషేకం

KNR: ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. సీతా సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. స్వామివారిని స్వర్ణ కిరీటంతో అద్భుతంగా అలంకరించగా, స్వర్ణ పుష్పార్చన సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై గోవింద నామస్మరణలతో మార్మోగింది.