VIDEO: శ్రీ మానస దేవి ఆలయంలో భక్తుల రద్దీ
KNR: గన్నేరువరం మండలం ఖాసీంపేటలో సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాలు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.