మహిళ మెడలో బంగారు చోరీ.. కేసు నమోదు

మహిళ మెడలో బంగారు చోరీ.. కేసు నమోదు

నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు దాటుతున్న ఓ మహిళ మెడలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆరు గ్రాముల సరుడును లాక్కెళ్లిన ఘటన శనివారం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్లోని పడారుపల్లికి చెందిన లక్ష్మమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. బాధితురాలు బాలాజీ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.