త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం: కలెక్టర్

SDPT: నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హేమావతి తెలిపారు. నంగునూరు మండలంలోని నార్మెట్టలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉద్యానవన శాఖ, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.