ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ

HNK: హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు సుగుణమ్మ ఇంటిని ఎంపీ కడియం కావ్య, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత గృహాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.