జాతీయ ఖోఖోకు నంద్యాల విద్యార్థిని ఎంపిక..!
నంద్యాల శాంతీరామ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని వెంకటేశ్వరి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. అనంతపురంలో జరిగిన యూనివర్సిటీ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచారు. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్‌లో ఆమె పాల్గొంటారని వెల్లడించారు.