అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు సీజ్
ATP: పామిడి(మం) ఎద్దులపల్లిలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 18 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హెచ్చరించారు.