అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

KRNL: వెల్దుర్తి మండలం కలుగోట్లలో అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు బోయ మద్దయ్య(55) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తనకు ఉన్న 2 ఎకరాలతో పాటు దేవుని మన్యం కౌలుకు తీసుకొని సాగు చేశారు. పంట నష్టంతో సరైన దిగుబడి లేక రూ.6 లక్షలు అప్పులు మిగిలాయి. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య లక్ష్మీదేవి తెలిపారు.