ఘనంగా అంజనేయ స్వామి పూజ కార్యక్రమం
BHPL: టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో టేకుమట్ల మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు.