'కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి'
KDP: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సూచించారు. బుధవారం పోరుమావిళ్ల మండల కమిటీ అధ్యక్షుడు డా.అన్వర్, తులసిరెడ్డిని కలిశారు. ఈ మేరకు పార్టీ పటిష్టత, విస్తరణ, అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాయని మండిపడ్డారు.