గొల్లలపాలెంలో అగ్ని ప్రమాదం.. తప్పన ప్రాణనష్టం

గొల్లలపాలెంలో అగ్ని ప్రమాదం.. తప్పన ప్రాణనష్టం

AKP: చోడపల్లి శివారు గొల్లలపాలెంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అల్లు అప్పారావు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి రెండు తాటాకు ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా ఇంట్లోని విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.