హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మకుంట భూమి వివాదంలో కోర్టు ఆదేశాలను రంగనాథ్ ధిక్కరించారని సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 27న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఆ స్థలంపై సుధాకర్ రెడ్డి హక్కులను సవాల్ చేస్తూ హైడ్రా అధికారులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.