మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు

VZM: కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని నెల్లిమర్ల ఎస్సై గణేష్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చేపట్టారు. స్థానిక మిమ్స్ వైద్య కళాశాల పరిసర ప్రాంతాల్లో ఏఎస్సై సతీష్, సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.