జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధి
నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా క్యూలు కట్టకుండా సాధారణంగా ఇంధనం పొందాలని సూచించారు. అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని, అనవసర నిల్వలు చేయరాదని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, కడప, అనంతపురం జిల్లాల నుంచి సరఫరా కొనసాగుతూ.. రీఫిల్లింగ్ జరుగుతోందని పేర్కొన్నారు.