VIDEO: రోడ్డు పనులు ప్రారంభించాలని గిరిజనులు నిరసన

AKP: రావికమతం మండలం టీ.అర్జాపురం నుంచి పాతకొట్నాబెల్లి వరకు రోడ్డు పనులు ప్రారంభించాలని బుధవారం బురదలో కూర్చోని ఆదివాసీ గిరిజనులు నిరసన తెలిపారు. గతంలో ఈ రోడ్డు పనులు మొదలు పెట్టి తవ్వేసి మధ్యలో వదిలేశారని, దీంతో గిరిజనులు రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పనులు మొదలు పెట్టాలని తెలిపారు.