VIDEO: దేవరపల్లిలో అనాథ శవానికి అంత్యక్రియలు

VIDEO: దేవరపల్లిలో అనాథ శవానికి అంత్యక్రియలు

సత్యసాయి: హిందూపురం మండలం దేవరపల్లి సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు హిందూపురం యుగంధర్‌ మిత్ర బృందానికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బృందం.. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నించినా.. వివరాలు తెలియకపోవడంతో యుగంధర్ అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు.