బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శిరసువాడ అనసూయమ్మ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి సర్పంచ్ రేణుక రాజు శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.