బాపట్లలో కమిషనర్ తనిఖీలు
బాపట్ల: మున్సిపల్ కమిషనర్ జీ.రఘునాధ రెడ్డి పట్టణంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. పలు వార్డుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్‌కు వెళ్లి ఆహారం రుచి చూశారు. ఎండల దృష్ట్యా క్యాంటీన్ బయట గ్రీన్ మ్యాట్లు వేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత డంప్ యార్డ్‌ను పరిశీలించి చెత్త నిర్వహణపై తగు సూచనలు చేశారు.