రేపు తల్లాడలో ఉచిత వైద్య శిబిరం

రేపు తల్లాడలో ఉచిత వైద్య శిబిరం

KMM: తల్లాడలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రత్యూష తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రముఖ నిపుణులు హాజరై గైనకాలజీ, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, టీబీ లక్షణాలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.