గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి
MHBD: కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గుండె నొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించగా, ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.