రోడ్డు భద్రతపై అవగాహన
SDPT: పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఆదేశాల మేరకు ఆదివారం టాక్సీ ఓనర్స్, డ్రైవర్లకు 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం నివారించాలని సూచించారు. వాహన పత్రాలు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అఖిల్, మహేష్, అబ్బు రమేష్ తదితరులు పాల్గొన్నారు.