భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ పట్టణంలోని భీమన్న ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. సమ్మక్క జాతర దగ్గరికి రావడంతో ముందుగా రాజన్న స్వామికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భీమన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.