పట్టు రైతులకు 'స్కిల్ సమగ్ర-2'తో అండ

పట్టు రైతులకు 'స్కిల్ సమగ్ర-2'తో అండ

ASR: జిల్లాలో పట్టు సాగు చేసే రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ తెలిపారు. గురువారం పాడేరులోని పట్టు పరిశ్రమ కార్యాలయంలో 'స్కిల్ సమగ్ర-2' పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో 400 మంది రైతులు సుమారు 800 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు.