దేశ రక్షణకు త్రివిధ ధళాల విభజన

త్రివిధ దళాలను వివిధ రకాలుగా విభజించారు. భారత సైన్యాన్ని ఏడు కమాండ్‌లుగా విభజించారు. ప్రతి కమాండ్‌కు లెఫ్టినెంట్ జనరల్ హోదా కలిగిన అధికారి నేతృత్వం వహిస్తారు. భారత నౌకాదళాన్ని మూడు కమాండ్‌లుగా ఏర్పాటు చేశారు. ప్రతి కమాండ్‌కు వైస్ అడ్మిరల్ ర్యాంకు కలిగిన అధికారి నేతృత్వం వహిస్తారు. భారత వైమానిక దళాన్ని ఐదు ఆపరేషనల్ కమాండ్స్, 2 ఫంక్షనల్ కమాండ్స్‌గా చేశారు.