సమస్యల పరిష్కారానికి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

KDP: రాజంపేటలో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, భూముల రీ సర్వే, భూ వివాదాల పరిష్కారం, రికార్డుల అప్డేషన్ వంటి రెవెన్యూ అంశాల్లో నిబద్ధతతో పనిచేయాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పారదర్శకత, సమయపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.