కోటగుళ్లను సందర్శించిన బ్రెజిల్ దేశస్థుడు
BHPL: గణపురంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను బ్రెజిల్ దేశానికి చెందిన ఇంగో సందర్శించారు. ఆలయంలో బ్రెజిల్ దేశస్థుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను అర్చకులు జూలపల్లి నాగరాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను తిలకించి శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు.