ANU ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

ANU ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

GNTR: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ - 2025 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్‌లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.