పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం

పటాన్‌చెరువు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.