బాండ్ పేపర్‌పై రాసిచ్చిన నిండు గర్భిణి
గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిండు గర్భిణి బోయ తిరుపతమ్మ తిమ్మప్ప ఈ స్థానిక ఎన్నికల పోరులో సంచలనం సృష్టించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, గ్రామ సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్‌పై 24 హామీలను రాసిచ్చారు. ఈ హామీలలో అభివృద్ధి పనులు నెరవేర్చని పక్షంలో రాజీనామా చేస్తామన్నారు.