PNG ఉంటే.. LPG సరఫరా కట్
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఉండి వాటిని వినియోగించుకోని కస్టమర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాంటి కుటుంబాలకు ఎల్పీజీ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.