రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు

NRPT: రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కుర్మయ్య హెచ్చరించారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడుమూరు గ్రామంలో బుధవారం నర్సింహ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.