VIDEO: నేరడిగొండలో కొనసాగుతున్న పోలింగ్
ADB: నేరడిగొండ మండలంలోని వడ్డూర్, దర్భతండా, బోందిడిలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.