'100% పన్నులు వసూలు చేసేలా చర్యలు'

'100% పన్నులు వసూలు చేసేలా చర్యలు'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో 100% పన్నుల వసూలుపై దృష్టి పెట్టామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన పన్ను వసూళ్ళ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంటి, ఆస్తి, వ్యాపార పన్నులను 100% వసూలు చేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించామన్నారు.