KTR వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి తుమ్మల

KTR వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై KTR వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం యూరియా సరఫరాలో జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, చెప్పుల క్యూలైన్‌ డ్రామాలు రైతులను మభ్యపెట్టే కుట్రలో భాగమని విమర్శించారు. రాష్ట్రానికి అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పారు.