కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి
ATP: పామిడి మండలం కోనేపల్లికి చెందిన మల్లికార్జున, సుభద్రమ్మ దంపతుల కుమారుడు చిన్న ఎర్రిస్వామి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో 144 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈయన అనంతపురంలోని SK యూనివర్సిటీలో m.com పూర్తి చేశాడు.