ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు

SKLM: సోంపేట మండలం కొర్లాంలో గల ప్రైవేట్ ఎరువుల దుకాణాన్ని మంగళవారం సోంపేట వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. షాపులో నిలువలు, అమ్మకం గురించి పరిశీలించారు. అనంతరం ఎరువుల చట్టం 1985 ప్రకారంగా అమ్మకాలు జరపాలని సూచించారు. ఇందులో సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు టి.భవాని శంకరరావు, మండల వ్యవసాయ అధికారి బి.నరసింహమూర్తి పాల్గొన్నారు.