విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. కొన్ని రోజులుగా ఈ విషయమై సందిగ్ధత నెలకొన్నా.. కోహ్లీ స్వయంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కోహ్లీ టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి.. వన్డేల్లో కొనసాగుతున్నాడు.