ఎనుమాముల మార్కెట్ ముందు ధర్నా
WGL: సీసీఐ ద్వారా వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ ఎనుమాముల మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా BRS డివిజన్ నాయకులు డా. బి సారంగపాణి మాట్లాడుతూ.. పత్తి కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు.