ముమ్మర తనిఖీలు నిర్వహించిన సీఐ

ముమ్మర తనిఖీలు నిర్వహించిన సీఐ

ప్రకాశం: భారత్ పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మార్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సమీపంలోని జాతీయ రహదారులపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలు వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైనా సమాజానికి హాని కలిగించే వస్తువులను సరఫరా చేస్తే సహించేది లేదని వాహనదారులను ఆయన హెచ్చరించారు.