చెరువు పునరుద్ధరణతో 150 ఎకరాలకు జలకళ

చెరువు పునరుద్ధరణతో 150 ఎకరాలకు జలకళ

PPM: కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలోని శబనీసు చెరువు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పూడిక తొలగింపు, కాలువల శుభ్రపరిచే పనులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. ఈ పనుల వల్ల 150 ఎకరాల సాగుభూమికి సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా పెరుగనుంది. దీంతో నీటి కొరతతో ఇబ్బంది పడిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.