నీట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత

నీట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత

కృష్ణా: ఈనెల 4వ తేదీ ఆదివారం జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గూగుల్ మీట్ నిర్వహించారు.