'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి'
కృష్ణా: గన్నవరం మండలం నారయ్య అప్పారావుపేటలో ఆరు రోజులుగా కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఉషా రామా ఇంజనీరింగ్ కళాశాల వాలంటీర్లు ఆదివారం ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. 'ప్లాస్టిక్ రహిత సమాజం, ఆరోగ్యకరమైన భవిష్యత్' నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.