గంజాయి రవాణాపై డాగ్ స్క్వాడ్ తనిఖీలు
విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నగరంలో గంజాయి రవాణా నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు సహా కీలక ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా మార్గాలను గుర్తించేందుకు చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.