రూ. 17.50 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణం
W.G: తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రధాన రోడ్డుపై కల్వర్టు నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 17.50 లక్షల వ్యయంతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో మురుగు నీరు లాగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం కల్వర్టు నిర్మిస్తున్నారు.