ముగిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి పవిత్రోత్సవాలు

ముగిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి పవిత్రోత్సవాలు

అన్నమయ్య: జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు.