ఘనంగా మొహర్రం వేడుకలు

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం మొహర్రం వేడుక సందర్భంగా గ్రామ పురవీధుల్లో పీరీలు (సవార్లను) ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హుస్సేన్, యాకుబ్ పాషా, ఇబ్రహీం, రవి, రాజు, యాకయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు.