ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్
MNCL: జిల్లాలోని న్యాయస్థానాలలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య తెలిపారు. సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. మోటార్ వాహన నష్ట పరిహారం, ఎన్ఐ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.