హాస్టల్స్, విద్యా సంస్థల్లో ఆహార భద్రతపై కలెక్టర్ ఆదేశాలు
HNK: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత సంస్థల ఫుడ్ ఇంఛార్జులను ఆదేశించారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సమావేశంలో మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.