VIDEO: మాజీ సీఎం జగన్‌ను కలిసిన నర్సింగ్ విద్యార్ధిని
కృష్ణా: మాజీ సీఎం జగన్‌ను పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్ధిని సుప్రియ ఈ రోజు కలిసింది. ఈ మేరకు జగన్‌కు తన బాధను చెప్పుకుంది. తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించిన తనను పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టారని తెలిపింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు తిరిగి పోలీసులకు అప్పగించారని, తిరిగి తనపైనే కేసు పెట్టారని కన్నీరు పెట్టుకుంది.