'ప్రతి పంచాయతీ ఆదర్శంగా నిలవాలి'

ASF: జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న 'స్వచ్ఛత హీ సేవ - 2025' కార్యక్రమాల గోడ పత్రికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. 'స్వచ్ఛోత్సవ్' థీమ్‌తో ఈ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అధికారులను ఆదేశించారు.